Saturday, September 21, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్ లోని మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా ’ కూడా యుద్ధం లోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ను ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్ అధీనం లోని గోలన్‌హైట్స్ వద్ద ఉన్నాయి. ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్టు వెల్లడించింది. తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్టు ప్రకటించింది. ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్ ఫామ్, షీబా ఫామ్స్ వద్ద ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్ నుంచి మద్దతు లభించిందని హమాస్ ప్రకటించింది. తాజాగా లెబనాన్ లోని హెజ్బొల్లా కూడా ఈ యుధ్ధం లోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ దళాలు తిప్పికొట్టాయి. కాకపోతే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. తమపైకి మోర్టార్ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ 1981లో స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News