హైదరాబాద్: గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల నుంచి 30 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, మరో వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. దానికి తోడు నగరంలోని పలు ప్రాంతాల్లో వీకెండ్‌లో డ్రగ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకోవాలని చూశారు.
దీంతో ఇద్దరు గోవాలో తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. వీకెండ్‌లో డ్రగ్స్‌కు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో వాటిని తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయించాలని ఇద్దరు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇద్దరు నిందితులు వేర్వేరుగా తమ సొంత కార్లలో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. వీకెండ్‌లో గ్రాము కొకైన్ రూ.20,000 నుంచి రూ.30,000 పలుకుతుందని తెలుస్తోంది.