Monday, December 23, 2024

ఎన్నికల్లో అక్రమాలపై పోలీసు శాఖ అప్రమత్తం….

- Advertisement -
- Advertisement -

బైండోవర్లు, అక్రమ మద్యం, నాన్‌బెయిలబుల్ వారెంట్లుపై నిఘా
జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలు గుర్తిస్తూ తగిన ఏర్పాట్లు వేగం
21 చోట్ల అంతరాష్ట్ర చెక్‌పోస్టులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సిసి కెమరాలు అమర్చి కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ సరఫరా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముందుగా ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని సమస్మాత్మక, సున్నితమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో వాటి వివరాలను నిఘా వర్గాల నుంచి పోలీసు శాఖ తెప్పించుకున్నట్లు సుమారుగా 5600 వరకు ఉండవచ్చని గుర్తించి వాటి వద్ద తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో రెండు నెల కితం 700 మంది పోలీసులను బదిలీ చేశారు. ఎస్సై నుంచి ఐపిఎస్ అధికారి వరకు మార్పులు చేపట్టారు.

ఎన్నికల సమయంలో విధులు ఎలా నిర్వహించాల్లో దానిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చారు. గస్తీ ఎలా జరపాలి సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఎలా పెట్టాలి అనే అంశాలతో పాటు ఇతర భద్రతాపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల నుంచి ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో 30 వేలమంది బైండోవర్లు, అక్రమ మద్యం అమ్మకాలు , నాన్‌బెయిలబుల్ వారెంట్లు, సమస్యత్మాక, సాధారణ పోలింగ్ స్టేషన్లలో నీటి సరఫరా, విద్యుత్, పర్నెచర్ వంటివి పరిశీలిస్తూ వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసు వెల్లడిస్తున్నారు. ఎన్నికల సమయంలో గొడవలు, పోలింగ్ స్టేషన్లపై దాడులు చేసేవారిని బైండోవర్ చేస్తున్నట్లు అక్రమ మద్యం అమ్మకాలు విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు, గ్రామాల్లో చాలా చోట్ల చిన్న చిన్న దుకాణాల్లో అక్రమంగా నడిపిస్తున్నట్లు గుర్తిస్తూ వాటిని సీజ్ చేస్తున్నట్లు, కొంతమందిపై కేసులు పెడుతున్నట్లు వివరిస్తున్నారు.

ఇంకా నాన్‌బెయిల్‌బుల్ కేసుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతున్నాయని పలు నేరాలు చేసి న్యాయస్ధానానికి హాజరుకాకుండా జాడలేని వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నట్లు చెబుతున్నారు. చీటింగ్, దొంగతనాలు కేసుల్లో ఉన్నవారు పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటూ దొరకడం లేదని వెల్లడిస్తున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా, మద్య నిల్వలు అరికట్టేందుకు అబ్కారీ శాఖ 24 గంటల పాటు తనిఖీలకు 21 చోట్ల అంతరాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపి సరిహద్దు మధ్య 8 చోట్ల, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 8 చోట్ల, కర్నాటక మధ్య 4 చోట్ల, చతీస్‌గడ్ సరిహద్దు వద్ద ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి సిసి కెమెరాలను అమర్చి రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసు శాఖతో పాటు ఇతర ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం సంయుక్తంగా 89 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అదే విధంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో అనుమానిత వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, గొడవలు, రిగ్గింగ్ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు బాసులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులకు సహాకరించాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News