Friday, December 20, 2024

అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

వ్యూహరచనకు ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర నేతలు
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నికల వ్యూహ రచనపై చేర్చించేందుకు ఆప్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ నేతృత్వంలో ఆప్ నేతలు ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఆప్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, పార్టీ మెనిఫెస్టో, ప్రధాన పార్టీలకు దీటుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం తదితర ప్రధాన అంశాలపై ఆప్ నేతలు కసరత్తు చేయనున్నారు. ఢిల్లీ, పంజాబ్ ఆప్ మేనిఫెస్టో మాదిరిగా ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్య, వైద్యం, 80 శాతం స్థానిక నియామక ప్రాధాన్యత, 33 శాతం మహిళా ఉపాధితో సహా పలు వాగ్దానాలతో కూడిన తెలంగాణ ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ దక్షణాది రాష్ట్ర ఇంచార్జి, ఎమ్యెల్యే సోమనాథ్ భారతి తో కలసి చేర్పించిన తరువాత త్వరలో ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కి చాలామంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో చాలామంది అధిక విద్యావంతులైన, సంఘసేవకులు, వైద్యులు, ఐటి నిపుణులు, న్యాయవాదులు, రైతులు, మహిళలు, యువజన విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్నవారందరి జాబితాపై ఆప్ కేంద్ర కమిటీ చర్చిస్తుంది. ,దరఖాస్తులను శితంగా పరిశీలించి, తుది జాబితా తాయారు చేస్తారు. ఈ నెల 16 తర్వాత ఆప్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. తొలిసారిగా పోటీ చేస్తున్నప్పటికీ ఆప్ అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీ లో అడుగుపెడతామన్న విశ్వాసాన్ని డా. సుధాకర్ వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని భావిస్తున్న ఆప్ ఇప్పటికే దాదాపుగా 90 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో చర్చల అనంతరం పార్టీ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో నాగార్జున సాగర్ లో రాజకీయ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కమిటి అభ్యర్థుల ఎంపికకు తుదిరూపం ఇచ్చి ఆ తర్వాత ప్రకటించనుంది. ఈ రాజకీయ క్యాంపుకు పార్టీ కేంద్ర నాయకత్వం నుండి సోమనాథ్ భారతి, సంజయ్ సింగ్ హాజరు కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News