Sunday, November 24, 2024

పోలీసుల తనిఖీలో ఐదు లక్షలు సీజ్

- Advertisement -
- Advertisement -

వైరా: తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలు కావటంతో నోట్ల కట్టలు బైటకు వస్తున్నాయి. వైరా పోలీసులు స్ధానిక క్రాస్‌రోడ్ సెంటర్ నందు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆంద్రాలోని పశ్చిమ గొదావరి జిల్లా నుండి హైద్రాబాద్‌కు వెళ్తూన్న కారులో ఓ మహిళ బ్యాంగ్ నుండి ఐదు లక్షల రూపాయలను పోలుసులు సీజ్ చేశారు.పశ్చిమ గొదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఇమ్మని రాజేశ్వరి కారులో ఎటువంటి ఆదారాలు లేకుండా ఉన్న 5 లక్షల రూపాయలు ఉండటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు.ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ తాను హైద్రాబాద్‌లో ఉంటూ వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంక్ లాకర్‌లోని నగదును హైద్రాబాద్ తీసుకెళ్తూన్నానని,ఈ సొమ్మును తాను కష్టపడి సంపాదించానని అన్నారు.అనంతరం ఎస్ మేడా ప్రసాద్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తే చర్యలు తప్పవని అన్నారు.

మరో ఘటనలో

తల్లాడలో రూ. 5 లక్షల రూపాయల నగదును తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి. సురేష్ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఐదు లక్షలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. ఆ నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లభించకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో తల్లాడ పోలీస్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News