Monday, December 16, 2024

టీచర్ భర్తీ పోటీ పరీక్షలకు మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః ప్రభుత్వ , స్థానిక సంస్థల పాఠశాల్లో స్కూల్ అసిస్టెంట్టు(ఎస్‌ఎ)సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) లాంగ్వేజ్ పండిట్(ఎల్‌పి), ఫిజికల ఎడ్యుకేషన్ టీచర్స్ (పిఇటి) పోస్టులకు సంబంధించి పోటీ పరీక్షలకు గాను అర్హత మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద తెలిపారు. అసక్తిగల అభ్యర్థుల ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

ఈ దరఖాస్తులను హజ్ హౌస్ 6వ అంతస్తు రూంనంబర్ 601లోని జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పని దినాల్లో నేరుగా అందజేయాల్సిందిగా ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 04023236112 ద్వారా గాని, directormscccctelangana@gmail.com ద్వారా సంప్రదించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News