Monday, January 20, 2025

87డాలర్లకు పెరిగిన క్రూడాయిల్

- Advertisement -
- Advertisement -

అమెరికా ముడి చమురు ధరల్లోనూ పెరుగుదల
పెరుగుతున్న బంగారం ధరలు చమురు సంస్థల షేర్లలో క్షీణత

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కా రణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన గా, మరోవైపు ముడి చమురు ధరలు భా రీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3 డాలర్లు పెరిగి 87 డాలర్లకు చేరింది. అదే సమయంలో అమెరికా క్రూడ్ ధర లు కూడా పెరిగాయి. ఇజ్రాయెల్, పాలెస్తీనా ప్రాంతాలు చమురు ఉత్పత్తి ప్రాం తాలు కానప్పటికీ, మధ్యప్రాచ్య ప్రాం తం ప్రపంచ సరఫరాలో దాదాపు మూ డో వంతు వాటాను కల్గివుంది. కాగా దీ ని ప్రభావం హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయి ల్ వంటి కంపెనీలపై ఉంది. ఈ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా క్షీణించా యి. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధర 5 శాతం పెరిగింది. డబ్లుటిఐ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 86.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బం గారం ధరలు కూడా పెరిగాయి. ప్రస్తు తం బంగారం ఔన్సుకు 1,865 డాలర్ల వద్ద ఉంది, వెండి 1.25% పెరుగుదల తో ఔన్సు 22 డాలర్లకు పైన ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News