- Advertisement -
బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కర్నాటకలోని హోస్పెట్ సమీపంలో రెండు ట్రిప్పర్లు, ఓ క్రూజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -