Thursday, December 19, 2024

అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కుకున్న యువతి… 12 గంటల తరువాత

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: గాజువాకలోని అప్పికొండ బీచ్‌లో రాళ్ల మధ్య యువతి చిక్కుకుంది. స్థానిక జాలర్లు గుర్తించి ఆమెను స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. భీమవరం చెందిన యువకుడు, మచిలీపట్నానికి చెందిన యువతితో కలిసి గాజువాకలోని అప్పికొండ బీచ్ వీక్షించేందుకు వచ్చారు. ఈ నెల 2 నుంచి అప్పికొండ సముద్రతీరంలోని కొండపై యువతి, యువకుడు ఉంటున్నారు.

పగలు విశాఖపట్నంలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపైన యువతి, యువకుడు నిద్రిస్తున్నాడు. కిందపడిన 12 గంటల తరువాత యువతిని జాలర్లు గుర్తించి డోలీ సాయంతో ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించారు. గాజువాకలో బైక ప్రమాదంలో యువకుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  అప్పికొండ రాళ్లు నుంచి కిందపడిపోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను యువతి వేడుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News