- Advertisement -
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో బిజెపి పార్టీ జనగర్జన సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. ప్రస్తుతం హర్యానా పర్యటనలో ఉన్నా అమిత్ షా మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు.
జనగర్జనే సభ అనంతరం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఐటిసి కాకతీయ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో కేంద్రమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై, పార్టీ పరిస్థతి, గెలుపు వంటి కీలక అంశాలపై నేతలతో అమిత్ షా చర్చించనున్నారు.
- Advertisement -