Saturday, November 23, 2024

అమెజాన్‌లో డెలివరీ పార్టనర్స్‌గా 12 కొత్త పారిశ్రామికవేత్తలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో భాగంగా తన డెలివరీ సర్వీస్ పార్టనర్ (డిఎస్‌పి) ప్రోగ్రామ్ ద్వారా 12 మంది కొత్త వ్యాపారవేత్తలను అమెజాన్ ఇండియా తీసుకుంది. భారతదేశం వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సిఆర్, మహారాష్ట్ర వ్యాప్తంగా తన డెలివరీ సర్వీస్ పార్టనర్ (డిఎస్‌పి) కార్యక్రమంలో భాగంగా 12 కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆన్‌బోర్డ్ చేసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రకటించింది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సొంత డెలివరీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని, నిర్వహించుకునేందుకు, వేలాది మంది డెలివరీ అసోసియేట్‌లకు పని అవకాశాలను డిఎస్‌పి ప్రోగ్రామ్ అందిస్తుంది.

అమెజాన్ ఇండియా దాదాపు 300 చిన్న, మధ్య తరహా వ్యాపారాలతో (ఎస్‌ఎంబిలు) భాగస్వామ్యం కలిగి ఉంది. గత రెండేళ్లలో అమెజాన్ ఇండియా ఇప్పటికే దాదాపు 100 కొత్త డిఎస్‌పిలను ఆన్‌బోర్డ్ చేసుకోగా, భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలను అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News