Monday, January 6, 2025

గంగపుత్ర నేతలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించండి

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డికి గంగపుత్ర చైతన్య సమితి వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : గంగపుత్ర నాయకులకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత కల్పించాలని గంగపుత్ర చైతన్య సమితి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం గంగపుత్ర చైతన్య సమితి నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు. గంగపుత్ర కులం నుండి 10 స్థానాలలో గెలిచే సత్తా కలిగి ఉన్నామని, కనీసం 5 స్థానాల్లోనైనా సీట్లు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా గోశామహల్ నుండి మెట్టు సాయి కుమార్, మంచిర్యాల నుండి వంగల దయానంద్ గంగపుత్ర, కరీంనగర్ నుండి చేతి ధర్మయ్య గంగపుత్ర, కామారెడ్డి, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలలో సీట్లు కేటాయించి గంగపుత్రుల హక్కులను పరిరక్షించే విధంగా, కులవృత్తి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ద్వారా గంగ తెప్పోత్సవ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర పండుగగా గుర్తించి, నిధులు కేటాయించాలని కోరారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎం.శంకర్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు మానుకోల సురేష్ గంగపుత్ర, గడ్డం యాదగిరి గంగపుత్ర, ఎర్రబోయిన ప్రవీణ్ గంగపుత్ర, పూస ధరణీ ధర్ గంగపుత్ర తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News