Saturday, November 23, 2024

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: నూతన సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని డిపిఆర్‌ఓ కార్యాలయం (జి.13)లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసిఎంసి) ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో అమోదం మంజూరు చేయాలని అన్నారు.

వార్తా పత్రికలు, ఈ పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, ఇతర అడియో వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. డిపిఆర్‌ఓ వి శ్రీధర్, ఎంసిఎంసి సభ్యులు ఎస్ శ్రీధర్, ఎఫ్‌పిఓ స్వామిగౌడ్, ఈడిఎం శ్రీకాంత్, ఎన్నికల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News