- Advertisement -
భువనేశ్వర్ : ఒడిశా బాలసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం సంభవించిన మూడు రైళ్ల ప్రమాదంలో మృతులైన వారిలో ఇంకా ఎవరూ గుర్తించని 28 మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భువనేశ్వర్‌లో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రక్రియను బుధవారం నాటికి మహిళా వాలంటీర్లు పూర్తి చేశారని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ వెల్లడించారు.
- Advertisement -