Monday, January 20, 2025

కల్లూరుగూడెంలో లారీ బోల్తా

- Advertisement -
- Advertisement -
  • డ్రైవర్ క్లీనర్ సురక్షితం

వేంసూరు: మండలంలోని కల్లూరుగూడెం గ్రామంలో నాగార్జునసాగర్ కాలువ వద్ద రహదారి ప్రక్కన లారీ బోల్తా పడి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ క్లీనర్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మర్లపాడు నుండి కల్లూరుగూడెం మీదుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వెళ్తున్న లోడు లారీ, నాగార్జునసాగర్ కాలువ వద్దకు రాగానే రాత్రిపూట సమయం కావడంతో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయే క్రమంలో లారీ కుడి వైపుకు దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మూల మలుపులు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయే క్రమంలో ఈ సంఘటన జరిగిందని స్థానికులు మన తెలంగాణకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News