అమరావతి: మంచి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించడం ఆనాది నుంచి మనం వింటున్నాంమని, ఇప్పుడు పేదలకి మనం ఇళ్లు ఇస్తుంటే.. రాక్షసంగా చంద్రబాబు కోర్టుకి వెళ్లి కుట్రలు చేసినా.. అవరోధాలన్నీ అధిగమించి.. పేదల కలనను నిజం చేశామని ఎపి ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట పర్యటనలో భాగంగా జగనన్న కాలనీలో జరిగిన సామూహిక గృహప్రవేశాల్లో సిఎం జగన్ పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కూడా చంద్రబాబు పేదలకు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం వచ్చాక కుప్పంలో కూడా 20 వేల ఇళ్లు తీసుకున్నారని అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు రాష్ట్రంలో కంటిన్యూగా కనిపించారా?.. కాని, ఇప్పుడు రాజమండ్రి జైలులో కనిపిస్తున్నాడని సిఎం అన్నారు. ఇక, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తరచూ తన భార్యలను మార్చుతుంటారని, పాకేజీ స్టార్ కు ఆడవాళ్లన్నా.. వివాహ వ్యవస్థన్నా గౌరవం లేదని మండిపడ్డారు. ఇప్పటికే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలను తెచ్చుకున్నాడని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడో..? అని ఎద్దేవా చేశారు.