Monday, December 23, 2024

దేశాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర ఆ పార్టీదే: కెఎ పాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, వారం రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ టికెట్ల కోసం ఏ పార్టీ నాయకుల వద్ద పడిగాపులు పడ్డవద్దని పోటీ చేసేవారికి టికెట్లు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని, బిసి ముఖ్యమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బిసిల నుంచి ఒకరు ఇప్పటి వరకు సిఎం కాలేదన్నారు.

బిసిలకు 60 శాతం, మహిళలకు 33 శాతం టికెట్లు సీట్లు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తన పార్టీలో పోటీ చేయాలనుకునే వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్ పే చేసి, దరఖాస్తు పంపాలన్నారు. మరోవైపు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని స్పష్టంచేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలిపించి కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News