Friday, November 22, 2024

13 నుంచి పాఠశాలలకు నుంచి బతుకమ్మ, దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గురువారం పాఠశాలలు, కళాశాలలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్ధినులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలతో వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఆడి పాడారు. ఇక ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు తమ ఊర్లకు తరలివెళ్లారు.

దీంతో ఆర్టీసీ బస్సులు విద్యార్ధులతో కిక్కిరిసిపోయాయి. ఇక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. మరోవైపు ఫార్మెటివ్ అసెస్‌మెంట్ -1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News