మేషం:- పనులు చకచకా సాగుతాయి. దీర్ణకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధికంగా అభివృద్ధి బాగుంటుంది.
వృషభం :- ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వాహనయోగం గోచరిస్తున్నది.
మిథునం :- సంతానంనకు నూతన విద్య, ఉద్యోగవకాశాలు పొందుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. రాజకీయ రంగాల వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.
కర్కాటక :- వివాదాలకు దూరంగా ఉండండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పనులలో తొందరపాటు వద్దు. బంధువులతో ఏర్పడిన విభేధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగస్తులకి భాద్యతలు పెరిగినా విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తారు.
సింహం :- వాహన యోగం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యపరుస్తాయి. వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదోన్నతులు పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు అర్జిస్తారు.
కన్య:- ఉద్యోగస్తులకి నూతన ఉత్సాహం నెలకుంటుంది. ప్రయోగాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదర వర్గంతో ఆనందంగా గడుపుతారు
తుల:- యత్న కార్యసిద్ధి పొందుతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సంప్రదింపులు, సలహాలు తీసుకుంటారు. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
వృశ్చికం:- తలపెట్టిన ముఖ్యమైన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆర్థిక లాభాలు అందుకొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆప్తులతో అలకలు అటకెక్కుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి.
ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. అనుకోని అతిధుల నుండి కీలక సంచారం సేకరిస్తారు. గృహంలో ఏర్పడిన సమస్యలు కొంత వరకు తీరుతాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సన్నిహితులు అండగా నిలుస్తారు.
మకరం :- సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. గతంలో జరిగిన వివాదాలు పరిష్కరించుకొంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం:- స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూరప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుకొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వాహన, భూ యోగాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు.
మీనం :- పనులు విజయవంతంగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. వస్తు లాభాలు కలుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.
సోమేశ్వరశర్మ : 8466932223,9014126121