గతేడాదితో పోలిస్తే 3.32 శాతం పెరిగిన లాభం
షేరుకు రూ.18 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నికర లాభం రూ.6,212 కోట్లు నమోదైంది. గతేడాదిలో వచ్చిన లాభం రూ.6,021 కోట్ల తో పోలిస్తే లాభం 3.32 శాతం పెరిగింది. ఈమేరకు కంపెనీ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీ ఆదాయం రూ.38,994 కోట్లతో 6.7 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.36,538 కోట్లుగా ఉంది. కరెన్సీ మారకంలో రెవెన్యూ త్రైమాసిక ప్రతిపాదికన 2.3 శాతం, వార్షికంగా 2.5 శాతం వృద్ధిని సాధించింది.
2023-24 క్యూ2(జులైసెప్టెంబర్)లో కం పెనీ ఆపరేటింగ్ మార్జిన్ 21 శాతం ఉంది. కంపెనీ సిఇఒ, ఎండి సలిల్ పరేఖ్ మాట్లాడు తూ, గణనీయమైన భారీ ఒప్పందాల గెలుపుతో అర్థ వార్షికంలో పనితీరు మెరుగ్గా ఉం దని, భవిష్యత్‌కు గట్టి పునాది ఏర్పడిందని అన్నారు. షేరుకు రూ.18 చొప్పున తాత్సాలి క డివిడెండ్ కంపెనీ నిర్ణయించింది. డివిడెండ్‌కు అక్టోబర్ 25 రికార్డు తేదీ, చెల్లింపు తేదీ నవంబర్ 6గా కంపెనీ ప్రకటించింది. క్యూ2 లో మెరుగైన ఫలితాలను సాధించామని కం పెనీ సిఎఫ్‌ఒ నిరంజన్ రాయ్ అన్నారు. ఈ సారి డివిడెండ్‌ను గతేడాది కంటే 9.1 శాతం పెంచామని తెలిపారు.