- Advertisement -
న్యూఢిల్లీ: ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్ టెక్ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.3,883 కోట్లతో వార్షికంగా 9.92 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.3,487 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 8.7 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.26,672 కోట్లతో 8.04 శాతం పెరిగింది.
గతేడాదిలో ఈ ఆదాయం రూ.26,296 కోట్లుగా ఉంది. షేరుకు రూ.12 చొప్పున కంపెనీ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో కంపెనీలో నియామకాలు గతేడాది ఇదే కాలంలో 23.8 శాతంతో పోలిస్తే ఇప్పుడు 14.2 శాతానికి తగ్గింది. హెచ్‌సిఎల్ టెక్ సిఇఒ, ఎండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, కరెన్సీ మారకంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 3.4 శాతం, త్రైమాసికంగా 1.0 శాతం మేరకు పెరిగిందని, సంస్థ మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు.
- Advertisement -