హైదరాబాద్: విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా శనివారం(అక్టోబర్ 14) తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలకు అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, బిఎస్‌పి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమ్రోసి, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
శనివారం ఉదయం 10.30 నుంచి 12.30 వరకు రెండు గంటల పాటు రాస్తారోకో కార్యక్రమం జరగనున్నది. హైదరాబాద్‌కు వచ్చే నాలు ప్రధాన వేలలో ఈ రోడ్డు అడ్డగింత కార్యక్రమాలు జరగనున్నాయి. మహబూబనగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే హైవేలో జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్ వద్ద రాస్తారోకో జరగనున్నది.
వరంగల్ రోడ్డుపైన శన్‌పూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘట్‌కేశర్ వద్ద రాస్తారోకో జరగనున్నది.
రామగుండం రోడ్డుపై పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, గజ్వేల్, షామీర్ పేట, గూంకుంట వద్ద ఈ కార్యక్రమం జరగనున్నది. ఖమ్మం రోడ్డుపైన కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్టాల, చౌటుప్పల్, హయత్‌నగర్ వద్ద రాస్తారోకో జరగనున్నది.