Sunday, December 29, 2024

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, సమాచార సాంకేతిక శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగాం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించిన కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తన రాజీనామా లేఖను పొన్నాల అధిష్ఠానానికి పంపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతుందని పొన్నాల ఆరోపించారు. కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తోందన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేనన్నారు. సీనియర్లకు కూడా అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని పొన్నాల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News