Friday, December 20, 2024

ఇసి నియామకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సిపిగా సందీప్ శాండిల్య, వరంగల్‌కు అంబర్ కిషోర్‌ఝా..నిజామాబాద్‌కు కల్మేశ్వర్ నియామకం రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాలకు కొత్త కలెక్టర్లు పది జిల్లాలకు నూతన ఎస్‌పిలు

ఇసి ఆమోదంతో నియామక ఉత్తర్వులు జారీచేసిన సిఎస్ శాంతికుమారి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఐపిఎస్, ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం నాలుగు జిల్లాల కలెక్టర్లు. మూడు డిపార్టుమెంట్ల కార్యదర్శులు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది విధితమే. దీంతో ఆ స్థానంలో కొత్తవారిని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముగ్గురేసి ప్యానెల్ జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దానిని ఆధారంగా చేసుకుని నాలుగు జిల్లాలకు కలెక్టర్లను, మూడు శాఖలకు కార్యదర్శులు, ప్రధాన నగరాలకు పోలీస్ కమిషనర్లు, పలు జిల్లాలకు ఎస్‌పిలను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా నియమించిన అధికారులందరూ వెంటనే కొత్త చోట్ల బాధ్యతలు స్వీకరించాలని సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమించారు. సందీప్ శాండిల్య ప్రస్తుతం పోలీసు అకాడమీ డైరెక్టర్‌గాఉన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు శుక్రవారం సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

ఎన్నికల సంఘం ఎంపిక చేసిన ఐఎఎస్ అధికారులు వీరే: ‘ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి భువనగిరికలెక్టర్ గా హన్మంతు కొండిబా, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతిబుద్ధ ప్రకాష్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా చొంగ్తులను ఎంపిక చేశారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఐపిఎస్‌లు వీరే: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య, వరంగల్ సిపిగా అంబర్ కిషోర్ జా, నిజామాబాద్ పోలీసు కమిషనర్‌గా కల్మేశ్వర్, జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్, సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్సవర్ధన్, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితీరాజ్ , మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావ్, నారాయణపేట్ ఎస్పీగా యోగేష్ గౌతమ్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ప్రభాకర్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్దేలను ఎంపిక చేశారు.

police 1

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News