Thursday, November 28, 2024

12 స్కీమ్‌లు..14 లక్షల మంది కార్మికులు

- Advertisement -
- Advertisement -

టిఎస్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ బోర్డు ద్వారా
కొత్త పథకాలతో లబ్ది పొందుతున్న తీరు
ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పథకాలేవీ?
ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని నాటి పాలకులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో కార్మికులు వివిధ పథకాల్లో చేరుతూ సిఎం కెసిఆర్ సర్కారుకు జై కొడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇతర శాఖల ద్వారా రైతులు, మహిళలు, యువతకు అపార అవకాశాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో కార్మిక శాఖ ద్వారా కూడా కార్మికులకు లబ్ది చేకూరుస్తోంది. ఇప్పటి వరకు 12 స్కీమ్‌లు కార్మికశాఖ ద్వారా అమలు అవుతున్నాయి. వీటిలో టిఎస్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ బోర్డు ద్వారా ఇప్పటి వరకు 14 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరింది. ఈ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులు దురదృష్ట వశాత్తూ ఏదైనా ప్రమాదంలో చనిపోతే రూ. 6 లక్షల పరిహారం ఇస్తున్నారు. ప్రమాదాలతో సంబంధం లేకుండా ఏదైనా వ్యాధుల బారిన పడి చనిపోయినా
లేదా సహజ మరణం సంభవించినా ఆ కార్మికుడికి రూ. 1 లక్ష పరిహారంగా ఇస్తున్నారు. వీరే కాకుండా మెటర్నరీ బెనిఫిట్ కింద పలువురు మహిళలు లబ్ది పొందారు. ఈ ఏడాదిలో ఈ స్కీం కింద 1,993 మంది లబ్ది పొందారు. వీరే కాకుండా 504 మంది అంగవైకల్యం గల వారు లబ్ది పొందారు.

నాటికి నేటికి ఎంత తేడా…
ఈ స్కీమ్‌లో మ్యారేజ్ గిఫ్ట్ కింద 2017 మే 1 తేదీ నుండి రూ. 30 వేలు ఇస్తుండగా దీనిని లక్ష రూపాలయకు పెంచారు. అదే విధంగా గర్భిణిలు, బాలింతలకు మెటర్నటీ బెనిఫిట్ కింద ఇప్పటి వరకు రూ. 30 వేలు చెల్లించే వారు . దీనిని లక్షకు పెంచారు. ఈ స్కీమ్ కింద పేర్లు నమోదు చేసుకున్న కార్మికుడు సహజసిద్ధంగా చనిపోతే అతనికి గతంలో రూ. లక్ష మాత్రమే వచ్చేది. దీనికి ప్రస్తుతం రూ. 6 లక్షలకు పెంచారు. అంత్యక్రియల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా వచ్చేది కాదు. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రూ. 30 వేలు అందేలా చూస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఎక్కడ కాగా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు కాలేదని కార్మికులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే కార్మిక శాఖ ద్వారా తమకు పలు స్కీమ్‌లను ప్రవేశ పెట్టి లబ్ది చేకూరుస్తోందని వారు గుర్తు చేస్తున్నారు. ఎందరో కార్మికులు మృతి చెందినా నాటి పలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి పథకాలు కూడా చక్కగా అమలు అవతున్నాయని వారు చెబుతున్నారు. ప్రమాద వశాత్తూ మృతి చెందితే గతంలో కేవలం పేర్లు మాత్రమే రాసుకునే వారని, ఈ సర్కారు ఏకంగా నగదును కూడా వెను వెంటనే ఆయా కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని వారు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News