పారిస్:ఫ్రాన్స్‌లో ని ఓ స్కూలులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరో టీచర్‌సహా ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ సూలులో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఓ యువకుడు పాఠశాలలోకి ప్రవేశించి ఉపాధ్యాయులు, విద్యార్థులపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడితో భయపడిన పిల్లలు తరగతి గదుల్లోనే తలుపులు వేసుకుని ఉండిపోయారు.
కాగా దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం అతడ్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి అప్పగించారు. 20 ఏళ్ల పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఈ యువకుడికి రాడికల్ ఇస్లామిజంతో సంబంధాలున్నాయని వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్‌హమాస్ వివాదానికి ఈసంఘటనకు ఏదయినా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు .మరో వైపు ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ అరాస్ వెళ్తున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.