Tuesday, November 5, 2024

హెచ్‌సిఎ అధ్యక్ష పదవి కోసం జగన్‌మోహన్ రావు నామినేషన్

- Advertisement -
- Advertisement -

మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎంఎల్‌సి కవిత ఆశీస్సులు!
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అర్శనపల్లి జగన్‌మోహన్ రావు శుక్రవారం నామినేషన్ దాఖ లు చేశారు. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య, తె లంగాణ హ్యాండ్‌బాల్ సంఘంలో జగన్‌మోహ న్ రావు కీలక పదవులు నిర్వహించిన విష యం తెలిసిందే. తాజాగా ఆయన హెచ్‌సిఎ ఎ న్నికల్లోనూ బరిలోకి దిగాలని నిర్ణయించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సిఎ పేరుతో జగన్‌మోహన్ రావు ప్యానెల్ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 20న హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ ప్యానెల్‌లు తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. తాజాగా జగన్‌మోహన్ రావు ప్యానెల్ కూడా హెచ్‌సిఎలో వివిధ పదవు ల కోసం పోటీ పడనుంది.

జగన్‌మోహన్ రావు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా పి.శ్రీధర్, ప్రధా న కార్యదర్శిగా ఆర్.హరినారాయణ, సంయు క్త కార్యదర్శిగా భారత మాజీ క్రికెటర్ నోయల్ డేవిడ్, కోశాధికారిగా సి.జె.శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డాక్టర్ అన్సార్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ప్యానె ల్ సభ్యులు నామినేషన్‌ను దాఖలు చేశారు. తమను గెలిపిస్తే హైదరాబాద్ క్రికెట్‌లో నెలకొ న్న అనిశ్చిత వాతావరణాన్ని పూర్తిగా తొలగిస్తామని, మళ్లీ హెచ్‌సిఎకు పూర్వవైభవం తెస్తామ ని జగన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు. భారత హ్యాండ్‌బాల్ సంఘంలో సుదీర్ఘ కాలంగా ఉన్న వివాదాలకు సానుకూల పరిష్కారాన్ని కనుగొ న్న విషయాన్ని గుర్తు చేశారు. హెచ్‌సిఎలో కూ డా సమూల మార్పులు తెచ్చి పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్‌మోహన్ రావు వెల్లడించారు.

అధికార పార్టీ మద్దతుతో..

హెచ్‌సిఎ ఎన్నికల బరిలోకి దిగుతున్న జగన్‌మోహన్ రావుకు అధికార బిఆర్‌ఎస్ పార్టీ అం డగా నిలిచింది. రాష్ట్ర మంత్రులు కెటి రామారా వు, హరీష్ రావు, ఎంఎల్‌సి కవితలు ఆయన పానెల్‌కు మద్దతుగా నిలిచినట్టు సమాచారం. చాలా రోజులుగా హెచ్‌సిఎలో పాగా వేసేందు కు బిఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఒక దశ లో కల్వకుంట్ల కవిత హెచ్‌సిఎ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆమె హెచ్‌సిఎలో పోటీ చేసే నిర్ణయానికి స్వస్తి పలికినట్టు తెలిసింది.

అయితే ఆమె నేరుగా బరిలోకి దిగకున్నా జగన్‌మోహన్ రావును వెనుకుండి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రులు కెటిఆ ర్, హరీష్ రావులు కూడా జగన్‌మోహన్ రావు గెలుపు కోసం తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వివాద రహితుడు, విద్యావేత్త అయిన జగన్‌మోహన్ రావుకు హెచ్‌సిఎల్‌లోని వివిధ క్లబ్బుల సభ్యులు కూడా మద్దతు ప్రకటించినట్టు తెలిసింది. ఇక తన ప్యానెల్‌లో వివాద రహితులను చోటు కల్పించడం కూడా జగన్‌మోహన్ రావుకు కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే బరిలో ఉన్న ఉన్న ఇతర ప్యానెల్‌లు కూడా బలమైనవే కావడంతో పోటీ తీవ్రంగా ఉండడం ఖాయం.హెచ్‌సిఎ అధ్యక్ష పదవి కోసం
జగన్‌మోహన్ రావు నామినేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News