Monday, December 23, 2024

రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిరుద్యోగిని ప్రవళిక ఆత్మహత్య విచారకరమని పేర్కొన్నారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. బతుకమ్మ చేస్తా.. బాధనూ పంచుకుంటాం అని తెలిపారు. బతుకమ్మ పండగను కించపరచడం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యం అన్నారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై రాజకీయం చేయడం మీ విధానామా? అని కవిత ప్రశ్నించారు.

నోటిఫికేషన్లు అడ్డుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటుందని ఆమె పేర్కొన్నారు. గ్రూప్-2 వాయిదా వేయాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా?.. గ్రూప్-2 వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయలేదా?.. రేవంత్ ఆవేదన బూటకం… కాంగ్రెస్ ఆందోళన నాటకం అని కవిత ఎద్దేవా చేశారు. మీ వ్యవహారశైలి హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News