Monday, December 23, 2024

పొన్నాలపై రేవంత్ వ్యాఖ్యలు… అగ్ర కుల దురహంకారానికి నిదర్శనం : జాజుల

- Advertisement -
- Advertisement -

బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బిసి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెవంతరెడ్డి తన భాషను మార్చుకుంటే మంచిదని, నోటి దుల, అగ్రకుల అహంభావం, ఆధిపథ్యమదంతో బిసి,ఎస్‌సి, ఎస్‌టిలపై అనుచితంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఉరుకునేది లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అగ్రకులాలు, ముఖ్యంగా రెవంత్ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీ మారితే చడీ చప్పుడు చేయని ఆయన, బిసిల విషయంలో మాత్రం అందుకు విరుద్దంగ ఏట్ల బడితే అట్లా, ఏది బడితే అది మాట్లాడి బిసిల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పొన్నాలపై మాట్లాడిన విధానాన్ని బిసిలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. గతంలో బిసి కూలాలను వృత్తుల పేరుతో కించపరిచారని, మొన్న మందకృష్ణ మాదిగపై చాల చిల్లరగా మాట్లాడారని, నేడు పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్ పార్టీ నుండి పొమ్మనకుండా పొగ బెట్టి, ఆయనను తీవ్రంగా అమమానించి రాజీనామా చేసేలా చేసి, తీరా రాజీనామా చేశాక సచ్చే ముందల సిగ్గులెకుండ అంటూ కించపర్చడం చాల దారుణమన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నుండి కొండ విశ్వేశ్వర్ శాస్త్రి, అనిల్ కమార్ రెడ్డి, గూడూరు నారయణ రెడ్డి,  రాజగోపాలారెడ్డి వెళ్ళిపోతే ఎందుకు మౌనంగ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ బిసి గురించి మాట్లాడుతుంటే, గల్లిలో రేవంతారెడ్డి బిసిలనుఅవమానిస్తున్నాడని, రేవంత్ వైఖరి కాంగ్రెస్ పార్టీకే నష్టమని జాజుల అన్నారు.

రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం
పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ బిసి సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. పొన్నాల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అగ్రకుల అహంకారంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన పొన్నాలపై ఇష్టానుసారంగా మాట్లాడటంపై సంఘం నాయకులు మండిపడ్డారు. గాంధీ భవన్ రెడ్డి భవన్ గా మార్చి బిసి నాయకులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. లేకపోతే రాళ్లతో కొట్టి దాడులు చేస్తామని హెచ్చరించారు. అలాగే కొడంగల్ లో నిలబడుతున్న రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News