Monday, December 23, 2024

చంద్రశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య విమర్శ కేంద్రంగా నిలిచారు

- Advertisement -
- Advertisement -

మన నవలలు, మన కథలు ఆవిష్కరణ కార్యక్రమంలో జూలూరి

మన తెలంగాణ / హైదరాబాద్: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ సాహిత్యానికే కాదు,  రెండు తెలుగు రాష్ట్రాల్లోను తెలుగు సాహిత్యవిమర్శా కేంద్రంగా నిలిచారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. అనంతపురం ప్రభుత్వ కళాశాలలోని డ్రామా హాల్లో శనివారం సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు, కవి, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి పుస్తకాలు మన నవలలు (సాహిత్య విమర్శ), మన కథానికలు (సాహిత్య విమర్శ)లు పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భగా గౌరిశంకర్ మాట్లాడుతూ..అధ్యయనం, అవగాహన, స్పష్టమైన సామాజిక దృక్పథం వున్న ప్రగతిశీల విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అని ప్రశంసించారు.రాచపాళెం ”గురజాడ తొలికొత్త కధలపై విమర్శ“ చేశారని, కవిత్వంపై మంచి విమర్శ రాశారని, రాయలసీమ బాంబుల సంస్కృతిపై మంచి కవిత్వం రాశారని, రాచపాళెం సాహిత్య విమర్శా కేంద్రంగా నిలవటంలో ఆయన 50 ఏళ్ళ సుదీర్ఘ సాహిత్య కృషి ఉందన్నారు. రాచపాళెంలాగా ఎక్స్ రే తీసే కళ్ళు ఉండాలని, సాహిత్య విమర్శ ఎంత బాగుంటే తెలుగు సాహిత్యానికి అంత పురోగతి ఉంటుందని చెప్పారు. సాహిత్య విమర్శను బోధించడమే కాదు, తరగతి
గది బయట సమాజంలో ఎదురయ్యే సవాళ్ళకు దీటుగా జవాబిచ్చే వ్యక్తిత్వాన్ని వాళ్ళకు అందిస్తూ, సామాజిక ఉద్యమాలకు పునాదులయ్యే విలువలను, సాహిత్యసామగ్రిని విద్యార్థులకు అందజేసిన గురువు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ,శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి,ఆవిష్కరించి, ముఖ్యఅతిథిగా తన సందేశాన్ని వినిపించారు.రాచపాళెం సాహిత్య కృషిపై ‘విమర్శపునర్నవం’ ప్రత్యేక సంచికను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్య కొలకలూరి మధుజ్యోతి,విమర్శ పునర్నవం ప్రధాన సంపాదకుడు డా.కే.నాగేశ్వరాచారి, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణ స్వామి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.యస్. రఘు, సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్, దార్ల వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ సాహిత్య సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి, వై.గోపిరెడ్డి, డా.గేయానంద్, డా. ఎ.సి.ఆర్.దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News