Monday, December 23, 2024

జూబ్లీహిల్స్‌లో వింత దొంగ..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఖరీదైన కారును చోరీ చేసిన ఓ యువకుడు హల్‌చల్ చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. కారు చోరీ చేసిన నిందితుడిని పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఖరీదైన కార్లను దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడో దొంగ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడు అర్చిత్‌రెడ్డి హోటల్ దపల్లా హోటల్‌కు వచ్చాడు. కారును పార్కింగ్‌లో పెట్టి హోటల్‌కు వెళ్లాడు. వచ్చి చూసేసరికి రూ.1.7కోట్ల కారు కన్నించలేదు. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్నారు. మన్సురాబాద్‌కు చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు.

పోలీసులు పట్టుకోగానే నిందితుడు ‘ఆకాష్ అంబానీ తెలుసా..’ అంటూ దబాయింపునకు దిగాడు, హృతిక్ రోషన్ నా పీఏ అంటూ రుబాబు చూపించాడు. మంత్రి కేటీఆర్ తన కారు తీసుకెళ్లాలని సూచించారని.. తను, తన సహాయకుడు హృతిక్ రోషన్ కలిసి ఆకాష్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని చెప్పాడు. కారు చోరీ చేసిన యువకుడి మాటలు విన్న పోలీసులు ఏదో తేడా కొడుతోందని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వారు అప్పటు అసలు విషయం చెప్పారు. సాయికిరణ్‌కు మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న ప్రాంతం నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News