Monday, December 23, 2024

ఓట్ల కోసం విపక్షాలు శవరాజకీయాలు చేయడం సిగ్గు చేటు: రెడ్కో చైర్మన్‌ సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: మంచి భవిష్యత్తు ఉన్న బిడ్డ మరణం బాధాకరం. కానీ.. ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకొచ్చి రచ్చ చేసే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలంగాణ రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాలు చేసిందెవరు ? పరీక్షలు వాయిదా వేయాలని టిఎస్‌పిఎస్‌సిని ముట్టడించిందెవరు ? పరీక్షలు వాయిదా వేయాలని క్యాంపెయిన్ నడిపిన మాజీ ఐపిఎస్ ఎవరు ? పరీక్షలు వాయిదా వేయాలని కథనాలు ప్రసారం చేసిన మీడియా ఎవరిది? ఇప్పుడు ఎన్నికలున్నాయని పరీక్షలు రద్దు చేస్తే దాన్నీ కూడా సర్కారుకు ఆపాదించి రాజకీయం చేస్తున్నదెవరు ? అని ఆయన ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు.

ఎలక్షన్ కోడ్‌లో ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదని తెలిసి కూడా ఈ కుటిల రాజకీయం మీ ఓట్ల కోసమే కాదా? అని నిలదీశారు. విద్యార్థిని మరణానికి కారణం ఏంటో కూడా పూర్తిగా తెలియకుండానే.. రాబంధుల్లా అక్కడ వాలిపోయారన్నారు. తమ బిడ్డ చావుని రాజకీయం చేయొద్దని తల్లిదండ్రులు వేడుకున్నా…వారి కన్నీరు చూసి కూడా మీ నీచమైన రాజకీయాలు ఆపలేదన్నారు.ఒక పార్టీని మించి మరో పార్టీ ఏదో ఘనకార్యం చేసినట్టు అక్కడకు చేరి రాత్రంతా డ్రామా నడిపించారని విమర్శించారు. అబద్ధం వేగంగా వ్యాప్తి చెందవచ్చు..కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. మీ నీచ రాజకీయాలు ప్రజలకు అర్థమైన రోజున మీ బతుకులు ఏమౌతాయో అర్థం చేసుకోండి. ఇలాంటివి జరిగినప్పుడు మరో బిడ్డ ఇలా చేసుకోకుండా మనోధైర్యాన్ని నింపేలా మాట్లాడాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News