Monday, January 13, 2025

డీమార్ట్ లాభం రూ.623.35 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో డీమార్ట్ పేరిట సూపర్ మార్కెటలను నిర్వహిస్తున్న అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్ రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. సెప్టెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలో రూ.623.35 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.685.71 కోట్లతో పోలిస్తే లాభం 9.09 శాతం తగ్గింది. దుస్తులు, సాధారణ వస్తువుల కొనుగోళ్లు తక్కువగా నమోదు కావడంతో మారిన్లపై ప్రభావం చూపించిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఆదాయం 18.66 శాతం పెరిగి రూ.12,624.37 కోట్లుగా నమోదయిందని కంపెనీ తెలిపింది. కాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా 9 స్టోర్లు తెరిచినట్లు కంపెనీ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 336కు చేరినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News