మేషం:- ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య పరంగా చికాకులు ఎదురైన అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభం.
వృషభం:- కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆప్తులను కలిసి ఆనందంగా, విందువినోదాలలో పాల్గొంటారు. మితిమీరిన ఖర్చులు ఉంటాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు.
మిథునం :- చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ద వద్దు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం :- కార్యజయం పొందుతారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహనాలు, భూ, గృహాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు. దీర్ధకాలిక సమస్యల నుండి బయట పడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు లెక్కల రూపంలో అర్జిస్తారు.
సింహం :- పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు తొలుగుతాయి. వ్యత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధి అంతంతమాత్రంగా ఉంటుంది. అయినా మానసిక ప్రశాంతత ఉంటుంది.
కన్య:- పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి ఆస్థి లాభాలు పొందుతారు. వ్యత్తి-వ్యాపారాలలో నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంది.
తుల:- నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పొందే అవకాశాలు తలుపు తడతాయి. చర్చలు సఫలం అవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రవర్తన బాధ కలిగించే విధంగా ఉంటుంది.
వృశ్చికం :- ఋణాలు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వస్తులాభం.
ధనుస్సు:- ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన సంఘటనలు పునరావృతం కాకుండా ఆలోచనలు చేస్తారు.
మకరం:- ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కార్యజయం పొందుతారు. స్వగృహం కోసం ప్రయత్నాలు మొదలు చేస్తారు.
కుంభం :- కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహన్నిస్తాయి. వన్తు, వస్త్ర లాభాలు పొందుతారు. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక.
మీనం:- ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. సాహిత్య కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పదుగురిలో మన్ననలు పొందుతారు.
సోమేశ్వరశర్మ : 8466932223,9014126121