ప్రచార బరిలోకి గులాబీ దళపతి
మేనిఫెస్టో విడుదల ముహూర్తం : మ. 12.15
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎ న్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వేగం పెంచిం ది. ఇప్పటికే ఓ వైపు మంత్రులు కెటిఆర్, హ రీశ్ రావు.. మరోవైపు అభ్యర్థులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. ఆదివారం 15) నుంచి గులాబీ దళపతి రంగంలోకి దిగనున్నారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థులతో పార్టీ అధినేత కెసిఆర్ స మావేశం కానున్నారు. అభ్యర్థులకు బీ ఫారా లు అందజేసి, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నామినేషన్లు వేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికల నియామళి, ప్రచార వ్యూహాలను అభ్యర్థులకు సిఎం వివరించనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల మే నిఫెస్టోను చేయనున్నారు. 12.15 నిమిషాలకు మే నిఫెస్టో ఆవిష్కరణ ఉంటుందని పార్టీ వర్గా లు చెబుతున్నాయి. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిసిం ది. ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, యువతను ఆకర్షించేలా పలు హామీ లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిఆర్ తొలి విడత ప్రచార పర్వంహుస్నాబాద్‌తో మొదలై, నవంబర్ 8నబెల్లంపల్లిలో ముగుస్తుంది. సిఎం కెసిఆర్ ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటారు. తొలి విడతలో 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను బిఆర్‌ఎస్ అధినేత ఖరారు చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగియగా, అధినేత పాల్గొనే సభలతో ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే మంత్రులు కెటిఆర్,హరీశ్ రావు లు సైతం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు సిఎం కెసిఆర్ స్వయంగా బరిలోకి దిగి ప్రచార పర్వం మొదలు పెడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది. కనీసం వేరే రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉండగా, ప్రతిపక్షాలు ఒకడుగు వేసేలోపే బిఆర్‌ఎస్ వంద అడుగులు వే సే పరిస్థితి ఉంది. సిఎం కెసిఆర్ ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కనుంది.
ఊపందుకోనున్న ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో బిఆర్‌ఎస్ సభలను నిర్వహించనుంది. ఆదివారం నుంచి గులాబీ బాస్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. హుస్నాబాద్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు.అలాగే ఈ నెల 16న జనగామ, భువనగిరిలో కెసిఆర్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో, 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో.. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రచారం నిర్వహిస్తారు. బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో కొత్త ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
తమ నియోజకవర్గాలలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను కలుపుకుపోతూ మండలాలవారీగా ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజల కష్టసుఖాలు అడి గి తెలుసుకుంటున్నారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్వహించే బహిరంగ సభలతో ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఈ సభల ద్వారా పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఎన్నికలకు సన్నద్దం చేయనున్నారు.
నేడు సిఎంతో పొన్నాల భేటీ
కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసిన మాజీ టిపిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ కానున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు శనివారం స్వయంగా పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా, సిఎంను కలిసిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల లక్ష్మయ్యతో తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎంతో పొన్నాల భేటే ప్రాధాన్యత సంతరించుకుంది