Sunday, December 22, 2024

ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ (ఉక్రెయిన్) ఉక్రెయిన్‌పై రష్యా సాగించిన దాడుల్లో గత 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖెర్సన్ ఏరియాలో ఇద్దరు మృతి డొనెటెస్క్ ఏరియాలో ఇద్దరు, ఖర్కివ్ రీజియన్‌లో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఖెర్సన్ ఏరియాలో వంద బాంబులతో రష్యా దాడి చేసిందని స్థానిక గవర్నర్ ఒలెక్‌సండర్ ప్రొకుద్దిన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఖెర్సన్ నగరంపై రెండు బాంబులు పడడంతో కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిటీ అడ్మినిస్ట్రేషన్ అధినేత రోమన్ ఎంరోచ్కో వెల్లడించారు.

ఈలోగా రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం ఒక ప్రకటనలో గత రాత్రి ఉక్రెయిన్ 27 డ్రోన్లతో పశ్చిమ రష్యాపై దాడి చేసిందని వెల్లడించింది. ఖుర్‌స్క్ రీజియన్‌పై 18 డ్రోన్లు దాడి చేశాయని , సమీపాన గల ఖలినో మిలిటరీ వైమానిక స్థావరాన్ని లక్షంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు. రష్యా బెల్గొరోడ్ రీజియన్ పై మరో రెండు డ్రోన్లు దాడి చేశాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News