Saturday, November 23, 2024

కరాచీలోఎయిరిండియా విమానం.. ప్రయాణికుడి చికిత్స కోసం ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: దుబాయ్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు అత్యంత తీవ్రస్థాయిలో అస్వస్థతతకు గురయ్యాడు. వెంటనే తక్షణ వైద్య సాయం అవసరం అని గుర్తించారు. దీనితో మార్గమధ్యంలో అత్యంత సమీపంలో కరాచీ ఉండటంతో వెంటనే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడి జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. అక్కడ అత్యవసర వైద్యసాయం అందించారు. తరువాత ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది. దీనితో ఈ ప్రయాణికుడితో పాటు విమానం తిరిగి బయలుదేరి నిర్ణీత మజిలీ అమృత్‌సర్‌కు చేరుకుంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు ఆదివారం వివరాలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News