- Advertisement -
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కూకట్ పల్లి పరిధిలో ఓ సెలూన్ యజామాని అశోక్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా దుండగులు వాటిని ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -