Monday, December 23, 2024

బిఆర్ఎస్ మ్యానిఫెస్టోతో వార్ వన్ సైడ్‌: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నందిపేట: ఓ వైపు బిఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకపోతుంటే కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభ్యర్థులు దొరకడంలేదని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. నందిపేట మండలంలో ఇంటింటి ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఆర్మూర్‌లో బిఆర్‌ఎస్ ప్రచార జోరుగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో వార్ వన్ సైడ్‌గా మారిందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో మళ్లీ బిఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త పొన్న ఈశ్వర్ ఇటీవల కన్నుమూయడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

Also Read: ఇందిరా పార్కులో ధర్నాలు ఎందుకు నిషేధించారు కెసిఆర్: ఈటల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News