Sunday, December 22, 2024

ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

బీరుట్: హమాస్ లక్షంగా గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులపై ఇరాన్ మరోసారి భగ్గుమంది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ చెప్పినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకనైనా ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపకపోతే ఈ ఏరియాలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి అని హోస్సేన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా హమాస్ దాడుల నాటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తున్న అమెరికాను కూడా ఇరాన్ దుయ్యబట్టింది. ఇలాంటి పరిస్థితులు నియంత్రిస్తామని, ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధాన్ని ఆపాలని, సంక్షోభాన్ని అరికట్టాలనే ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను అడ్డుకోవాలి అని అమెరికాను ఉద్దేశిస్తూ హోస్సేన్ పరోక్ష విమర్శలు గుప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News