Saturday, November 23, 2024

ఎన్‌డిఎలో చేరికతో జెడిఎస్‌లో చీలిక..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వపు జెడిఎస్ చీలికకు రంగం సిద్ధం అయింది. బిజెపి సారధ్యపు ఎన్‌డిఎలో చేరాలనే పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయాన్ని జెడిఎస్ కర్నాటక శాఖ అధ్యక్షులు సిఎం ఇబ్రహీం సోమవారం ధిక్కరించారు. జెడిఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి వైపు మొగ్గుచూపబోదని, ఎన్‌డిఎలో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనితో పార్టీలో నిట్టనిలువునా చీలిక పరిస్థితి ఏర్పడింది. జెడిఎస్ అంటేనే సెక్యులర్ అని ,ఈ పార్టీ మమతత్వ బిజెపితో చేతులు కలపడం కుదరదని ఇబ్రహీం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ భవితవ్యం నిర్ణయించేది తానే అని ఆయన స్పష్టం చేశారు. తమ వర్గం పార్టీ ఏర్పాటు ప్రాతిపదిక అయిన లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని, పేరు సూచిస్తున్నట్లుగా తమదే నిజమైన పార్టీ అవుతుందని ఇబ్రహీం తేల్చేశారు. మన పార్టీని మనం ఎందుకు దెబ్బతీసుకోవడం అని ప్రశ్నించారు. తన వర్గీయులతో సమావేశం తరువాత ఇబ్రహీం విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News