Friday, November 22, 2024

దాడులు ఆపితే బందీలకు విముక్తి..

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్ : వెను వెంటనే ఇజ్రాయెల్ తన సైనిక వైమానిక దాడులను నిలిపివేస్తే , తాము బందీలను వదిలిపెడుతామని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు ఈ మేరకు హమాస్ షరతు పెట్టిందని ఇరాన్ అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. అయితే ఈ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ , హమాస్ వర్గాల నుంచి ఎటువంటి అధికారిక నిర్థారణ వెలువడలేదు. ప్రస్తుత సంక్షోభ తక్షణ నివారణకు ఇటు బందీల విడుదల, కాల్పుల విరమణ కీలకమని, దీనిని తాము ఆశిస్తున్నామని ఇరాన్ పేర్కొంది. అయితే ఈ శాంతిసంకేతాల నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ సోమవారానికి పదో రోజుకు చేరింది.

తాము జరిపిన వైమానిక దాడులలో మరో ఇద్దరు హమాస్ అగ్రనేతలు హతులు అయినట్లు ఇజ్రాయెల్ సోమవారం రాత్రి తెలిపింది. హమాస్‌కు చెందిన ఇంటలిజెన్స్ ప్రాంతీయ చీఫ్ ఖాన్ యోయూనిస్‌ను చంపివేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. ఇప్పటి ఘర్షణలో ఇక అధునాతన వినూత్న ఐరన్ బీమ్ లేజర్ క్షిపణి ఆయుధ వ్యవస్థను వాడబోతున్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. దీనిని తాము తొలిసారిగా వాడుతామని వెల్లడించారు. కాగా ప్రస్తుత పరిస్థితిపై మరోసారి చర్చిచేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం రాత్రి టెల్ అవీవ్ చేరారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News