Friday, November 22, 2024

రజాకార్ సినిమాను, ప్రస్తుతం విడుదలైన టీజర్‌ని నిలుపుదల చేయాలి!

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కమిషన్‌కు రావి ప్రతిభారెడ్డి వినతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ లబ్ధి కోసం నిర్మించిన రజాకర్ సినిమాను, ప్రస్తుతం విడుదలైన టీజర్ ను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్‌కు పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి జాతీయ ఫౌండేషన్ సభ్యురాలు, రావి నారాయణ రెడ్డి మనువరాలు, రావి ప్రతిభారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బిఆర్ భవన్‌లో సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రావి ప్రతిభారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధిపొందేందుకే ‘రజాకర్’ సినిమాలో మతపరమైన అంశాలను పొందుపర్చారని విమర్శించారు.

రజాకార్ సినిమాలో వాస్తవాలను కప్పిపుచ్చారని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది అమరులయ్యారని, ఈ ఉద్యమంలో మగ్ధూం మొహియొద్దీన్ లాంటి అనేక మంది నాయకులు ఉన్నారని, వీరి గురించి ఎందుకు చూపిండంలేదని సినీ నిర్మాతలను ప్రశ్నించారు. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి ఈ సినిమా కళ్లకు గంతలు కట్టిందని విమర్శించింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు భిన్నంగా, కేవలం మతపరంగా మాత్రమే రజాకర్ సినిమాను తీశారని, వెంటనే దీనిని నిలుపుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News