Friday, December 20, 2024

పేదింటికి ఏటా రూ. 4092 కోట్లు సబ్సిడీ

- Advertisement -
- Advertisement -

రూ.400కే సిలిండర్ హామీతో చల్లబడనున్న గ్యాస్ ధర మంటలు

ఇంటింటా హాట్ టాపిక్‌గా మారిన బిఆర్‌ఎస్ హామీ

90% మంది వినియోగదారులకు లబ్ధి
మహిళలను ఆకట్టుకుంటున్న కెసిఆర్ అభయం..

ప్రభుత్వంపై ఏటా రూ.4,092 కోట్ల భారం

మన తెలంగాణ/హైదరాబాద్:  వంటింటి గ్యాస్‌ధరల మంటలు చల్లబడే సమయం దగ్గరపడుతోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రా ష్ట్రంలో ప్రతి పేద కుటుంబం వినియోగిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలపై రూ.550 రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న గ్యాస్ సిలిండర్ ధరల ప్రకారం చూస్తే పేద కుటుంబాలకు రూ.400కు గ్యాస్ సిలిండర్ సరఫరా కానుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పడు తెలంగాణ అంతటా ఇంటింటా హాట్‌టాపిక్‌గా మారిపోయింది.

పేద కుటుంబాలు ప్రత్యేకించి మహిళలు మేనిఫెస్టోలో ప్రకటించిన వంటగ్యాస్ రాయితీ హామీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిపించి అధికారం అప్పగిస్తే పేదింటి మహిళల వంటింటి కష్టాలు తగ్గించటంపై ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టి సారించారు. అందుకు తగ్గట్టుగానే బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కన్నీళ్లు తుడిచే ప్రథకాలకే ప్రాధాన్యత కల్పించారు. మహిళల ఆదరాభిమానాలు చూరగొని ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పథకాలు రచించారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సెగలు చిమ్ముతున్న గ్యాస్ ధరల మంటలను చల్లబరిచి వంటగ్యాస్ వినియోగదారులకు కొంతైనా ఉపశమనం కల్పించాలని లక్షంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజా నా నుంచే వంటగ్యాస్‌కు రాయితీలు అందజేసి ఆదుకోవాలని సంకల్పించారు. ప్రతినెల గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందజేస్తామనిహామీ ఇచ్చారు. అదికూడా ఎన్నికలు ముగిసి బిఆర్‌స్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాక నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచే రూ.400కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తీసుకురావాని సంకల్పించారు.

రూ.4092కోట్లు గ్యాస్ భారం !
ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింన విధంగా రూ. 400కు వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం అమల్లోకి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపైన ఏటా రూ.4092కోట్లు భారం పడనుందని ఆర్ధికరంగం నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 16లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్ర భుత్వం ఉజల పధకం కింద ఇచ్చిన సబ్సిడి గ్యాస్ కనెక్షన్లు 11.48లక్షలు ఉన్నాయి. వీటి ని మినహాయిస్తే మిగిలిన వాటిలో పేద కు టుంబాలకు చెందిన గ్యాస్ కనెక్షన్లు 90లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతి కుటుంబం వంటిం టి అవసరాల కోసం ఏటా సగటున ఎనిమిది గ్యాస్ సిలిండర్లను వినియోగించుకుంటోంది. వీటికోసం రాష్ట్రంలోని వంటగ్యాస్ వినియోగదారులు సిలిడర్‌ను రూ.950 పెట్టి కొనగోలు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు మొత్తం 7068కోట్లు వెచ్చించాల్సివస్తోంది.

తాజాగా బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ అమలులోకి వస్తే గ్యాస్ సిలిండర్‌పైన ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వం రూ.550 రాయితీ కల్పించాల్సివస్తుంది. అంటే ప్రతి ఇంటికి దాదాపు రూ. 4,400ల సబ్సిడీ అందుతోంది.
ఇందుకోసం ప్రభుత్వపైన ఏటా రూ4092 కోట్లు భారం పడే అవకాశాలు ఉన్నాయి. రా యితీపోగా సిలిండర్ ధర రూ.400 ప్రకారం రాష్ట్రంలోని 90లక్షల మంది వినియోగదారలు ఏటా మొత్తం రూ. 2976కోట్లు చెల్లించాల్సివుంటుందని ఆర్ధికరంగం నిపుణులు చేబుతున్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 90శాతంపైగా వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఎ త్తున ధరల మంటనుంచి ఊరట కలగనుంది. బిఆర్‌ఎస్ ఈ పథకాన్ని ఎన్నికల హామీ కింద ప్రకటించగానే రాష్ట్రంలో ఇపుడు ఇదే మహిళలకు ప్రధాన చర్చనీయాంగా మారిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News