Monday, December 23, 2024

శ్రీసత్యసాయి జిల్లాలో బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: పాఠశాలలో ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. నీళ్లు తాగటానికి స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. స్టాఫ్ రూమ్‌లో రెడ్డి నాగయ్య అనే ఉపాధ్యాయుడు ఒంటరిగా ఉండడంతో బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడు. దీంతో బాలికకు కడుపు నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పోక్సో చట్టం 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్‌పి శ్రీలత ఆస్పత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించారు. ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Also Read: రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ: అశ్లీల వీడియోలు పంపిన క్యాబ్ డ్రైవర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News