పేదలు, రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు
మేనిఫెస్టో విడుదల చేసిన బిఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బిఎస్పీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆపార్టీ మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసి పలు హామీలిచ్చింది. ఈ మేనిపెస్టోలో విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాన్షీయువ సర్కార్ పేరిట విడుదల చేసిన ఆయన యువత, పేదలు, రైతుల కోసం పలు పథకాలు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు… కాన్షీ యువ సర్కార్, బహుజన రైతు బీమా, దొడ్డి కొమరయ్య భూమిహక్కు, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి, భీమ్ రక్ష కేంద్రాలు, పూలే విద్యా దీవెన, బ్లూ జాబ్ కార్డు, నూరేళ్ల ఆరోగ్య ధీమా, వలస కార్మికుల సంక్షేమ నిధి, షేక్ బందగి గృహ భరోసా వంటి అమలు చేస్తామన్నారు. బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని, టికెట్ల పంపిణీలో సమాన్యాయం పాటిస్తామని, అన్ని వర్గాలకు సముచితం స్థానం ఇస్తామని తెలిపారు. రాష్ట్రం ప్రజలు బిఎస్పీ అదికారం కట్టబెట్టాలని కోరారు.