Friday, December 20, 2024

దేశంలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విపక్ష కూటమి ‘ఇండియా’: రాహుల్

- Advertisement -
- Advertisement -

మిజోరాం: బీజేపీ కన్నా విపక్ష కూటమి ‘ఇండియా ‘దేశంలో అరవై శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ఐజాల్‌లో విలేఖరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణతోపాటు మిజోరాంలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. మిజోరాంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్‌గా నెలనెలా రూ.2000 అందిస్తామని, రూ.750 కే గ్యాస్ సిలిండర్ అందించడమౌతుందని చెప్పారు.

బీజేపీని, ఆ పార్టీ మూలం ఆర్‌ఎస్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ తమ పార్టీ వికేంద్రీకరణపై నమ్మకం ఉంచితే, ఢిల్లీ లోనే అన్ని నిర్ణయాలు తీసుకొనడంపై బీజేపీ విశ్వసిస్తోందని విమర్శించారు. దేశం లోని మొత్తం వ్యవస్థాపరమైన యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా, దేశ పునాదులను రక్షించడంలో కాంగ్రెస్ రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున రెండు రోజుల పాటు ప్రచారం చేయడానికి రాహుల్ సోమవారం ఇక్కడికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News