Monday, November 25, 2024

స్వలింగ వివాహాలకు సుప్రీం రెడ్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -
చట్టబద్ధతకు నిరాకరణ

న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దా ఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఎల్‌జిబిటి క్యుఐఎ -+ వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి స మాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పే ర్కొంది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. అలాగే స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించవద్దని వారి హక్కులను కాపాడాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి … మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం … నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.
కేంద్రం అభ్యంతరాలను అంగీకరించని సిజెఐ
ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం వెలిబుచ్చిన అభ్యంతరాలకు ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించలేదు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్లకు కేంద్రం అభ్యంతరం వెలిబుచ్చింది. స్వలింగ సం పర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదని కేంద్రం తన అఫిడవిట్‌లో అభ్యంతరం వెలిబుచ్చింది. ఈ అ భిప్రాయాన్ని సీజేఐ అంగీకరించలేదు. స్వలింగ సంపర్కం అనేది పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం కాదని , ఈ అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. దీనిపై పరిమితంగానే పే ర్కొన్నప్పటికీ స్వలింగ సంపర్కం అన్నది కేవలం నగరాలకు చెందిన అంశం గా పరిమితం కాదని సీజెఐ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద అంశంపై ప్రత్యేక తీర్పు వెలువరించారు. తన తీర్పులో గ్రామాలైనా లేదా నగరాలైనా దానితో నిమిత్తం లేకుండా స్వలింగ సంపర్కులను గుర్తించాలని తన తీర్పులో పేర్కొన్నారు.

లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. లైంగిక ధోరణి కారణంగా ఆ వ్య క్తుల బంధం లోకి వెళ్లే హక్కును నియంత్రించకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చ ర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులు చట్టాలను రూపొందించవని, కా నీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ చెప్పారు. ఇక వివాహ వ్యవస్థ అనేది స్థిరమైనదని , దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టంలో సవరణలు తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. అయితే ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లే దా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని దీని చట్ట పరిధి లోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు. స్వలింగసంపర్కుల వివాహానికి కోర్టు చట్టబద్ధత కల్పించడానికి నిర్ణయిస్తే అధికారాల మౌలిక సిద్ధాంతాన్ని కోర్టు ఉల్లంఘించినట్టు అవుతుందని కేంద్రం పేర్కొన్నట్టు సిజేఐ తెలిపారు.
పార్లమెంటే నిర్ణయించాలి
“ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం … స్వలింగ సంపర్క జంటలు చేసుకునే వి వాహానికి ఎలాంటి గుర్తింపు లేదు. ప్రత్యేక వివాహ చట్టం కింద ఈ వివాహాల కు మేం హక్కులను కల్పించలేం అని సిజెఐ స్పష్టం చేశారు. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదు. ఈ వివాహాలను గు ర్తించేలా చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దే” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
దత్తతపై కుదరని ఏకాభిప్రాయం
స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత చేసుకునే హక్కులేదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై 3 ః 2 మెజార్టీతో తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్… దత్తతకు అనుకూలంగా.. .జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహ వ్యతిరేకం గా తీర్పులను వెలువరించారు. అయితే కేవలం భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులను చట్టం భావించట్లేదని సీజేఐ ఈ సందర్భంగా వెల్లడించారు.
వారిపై వివక్ష వద్దు: సిజెఐ
స్వలింగ సంపర్క జంటల వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీం కోర్టు … వారి హక్కులను మాత్రం పరిరక్షించాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. “ స్వలింగ సంపర్కులపై సమాజంలో ఎలాంటి వివక్ష చూపొద్దు. వారికి హక్కులను కల్పించాలి. వారి సహజీవనంపై ఫిర్యాదులు వస్తే … కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలి. వారి లైంగికత్వంపై విచారించేందుకు సమన్లు జారీ చేసి పోలీసులు వేధింపులకు గురి చేయకూడదు. అలాంటి వారు హార్మోనల్ థెరపీలు చేయించుకోవాలని కుటుంబ సభ్యులు బలవంతపెట్టొద్దు” అని సీజేఐ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News