Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన సుధీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుధీర్ రెడ్డి, తన కుమారుడు మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నియోజకవర్గంలో వివిధ మున్సిపాలిటీ లు, గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ వివిద శాఖల నాయకులు, బిజేపి పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఘట్కేసర్ మండలంల ప్రతాప్ సింగారంలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read: స్నేహితులతో సెక్స్ చేయాలంటూ భర్త వేధింపులు: పోలీసులకు భార్య ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News