- Advertisement -
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ను కలిశారు. ప్రవళిక కుటుంబసభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కెటిఆర్ వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఒకరికి ఉద్యోగం ఇస్తామని వాళ్ల కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. కేసు పురోగతిపై డిజిపితో మాట్లాడినట్లు కెటిఆర్ చెప్పారని ప్రవళిక సోదరుడు తెలిపారు. మా కుటుబానికి అండగా ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారన్నారు.
- Advertisement -